తెలంగాణ

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతిగార్ల:ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పర…

By · · Updated

Share this article
గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి 
-CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి
గార్ల:ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి  ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు .