పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 16
పరకాల:గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పరకాల కరెంట్ ఆఫీస్ వద్ద శివాజీ యువసేన గౌరవాధ్యక్షులు ఆర్.పి. జయంత్ లాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్సవ సమితి అధ్యక్షులు నాగబండి విద్యాసాగర్ హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా శివాజీ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులందరూ భక్తి పరవశంతో నవరాత్రులు జరుపుకోవాలని కోరారు. యువసేన ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు వాడడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. యువత ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా సూర రిషిత-రవి వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన నాయకులు కిరణ్, విజయ్, రవి, తిరుపతి, రాజేష్, అఫ్రోజ్, నాగరాజు, కాసిం, వంశీ, రాజు, ఆనంద్, అర్జున్, జిల్లెల్ల రాజకుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.





