తెలంగాణ

ఎంజీఎంలో మరోసారి భయం భయం!

ఎంజీఎంలో మరోసారి భయం భయం! తెలంగాణా గళం / హనుమకొండ (సెప్టెంబర్ 22):   • ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లో ఊడిన పైకప్పు పెచ్చులు • ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు, బంధువులు  • భవన భద్రతప…

By · · Updated

Share this article
ఎంజీఎంలో మరోసారి భయం భయం!

ఎంజీఎంలో మరోసారి భయం భయం!

తెలంగాణా గళం / హనుమకొండ (సెప్టెంబర్ 22):

 

• ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లో ఊడిన పైకప్పు పెచ్చులు

• ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు, బంధువులు

 • భవన భద్రతపై తీవ్ర ఆందోళన ​ ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస ప్రమాదాలు రోగులను, వారి బంధువులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ ,ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రోగులు గానీ, ఆసుపత్రి సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ​

ఇటీవలే ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఇదే తరహాలో సీలింగ్ పెచ్చులు ఊడిపడటంతో పలువురు గాయపడిన విషయం విదితమే. ఆ ఘటన మరువకముందే మళ్లీ ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ వార్డుల్లో పెచ్చులు కూలిపోవడం గమనార్హం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో భవన భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వేలాది మంది పేద రోగులు చికిత్స కోసం వచ్చే ఈ ఆసుపత్రిలో ఏ నిమిషానికి ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ​తక్షణ మరమ్మతులు చేపట్టాలి:

పాతబడిన భవన పైకప్పులను, వార్డులను అధికారులు వెంటనే సమగ్రంగా పరిశీలించి తగిన మరమ్మతులు చేపట్టాలని రోగుల బంధువులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.