తెలంగాణ

ఎంజీఎం వద్ద ఉద్రిక్తత.. తోపులాటలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు తీవ్ర గాయాలు!

తెలంగాణా గళం /హనుమకొండ, (సెప్టెంబర్ 22) వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఎంజీఎంలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనను పరిశీలించి, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ…

By · · Updated

Share this article
ఎంజీఎం వద్ద ఉద్రిక్తత.. తోపులాటలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు తీవ్ర గాయాలు!

తెలంగాణా గళం /హనుమకొండ, (సెప్టెంబర్ 22)

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఎంజీఎంలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనను పరిశీలించి, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.  

​బాధితులను పరామర్శించేందుకు వచ్చిన తమను ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు నిరోధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిర్బంధాలను ఛేదించుకుని ఆస్పత్రి ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జరిగిన ఘర్షణలో దాస్యం వినయ్ భాస్కర్ కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన నొప్పితో "అమ్మా.. అమ్మా.." అంటూ తీవ్ర వేదనకు గురయ్యారు.  

​వెంటనే స్పందించిన తోటి నాయకులు, కార్యకర్తలు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించడానికి వస్తే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమపై అక్రమ నిర్బంధాలు విధిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు.