హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలురగురుకుల పాఠశాలలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలతో అలంకరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి ఆయన విలువలు దేశానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. బాపూజీ అందించిన కాలాతీత సందేశం ప్రతి ఒక్కరినీ మెరుగైన సమాజ నిర్మాణం వైపు, వికసిత భారత్ లక్ష్యం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ మూడు సూక్తులు అయిన చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు వాటిపై విద్యార్థులు గాంధీజీ చిత్రపటం ముందు గుర్తు చేశారు.
ఎంజెపిలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలురగురుకుల పాఠశాలలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలతో అలంకరించారు.…
By తెలంగాణ గళం · · Updated
Share this article




