చింతగట్టులో రూ. 31,116 పలికిన వినాయక లడ్డు.
తెలంగాణ గళం/హన్మకొండ (చింతగట్టు):సెప్టెంబర్ 26:
చింతగట్టు గ్రామంలో గణనాథుని లడ్డు వేలం పాట పోటాపోటీగా సాగింది. గ్రామంలోని ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డును శనివారం రాత్రి వేలం వేశారు.
ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన దోమల నాగేశ్వరరావు (సన్నాఫ్ చంద్రయ్య) అత్యధికంగా రూ. 31,116 (ముప్పై ఒక్క వేల నూట పదహారు రూపాయలు) పాడుకుని లడ్డును దక్కించుకున్నారు.
స్వామివారి కృప కోసమే తాము ఈ వేలంలో పాల్గొన్నట్లు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




