తెలంగాణ

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలను ఖండించిన కడారి తిరుపతి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు తగవు తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్ర…

By · · Updated

Share this article

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు తగవు

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి ఖండించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

ధర్మారం మండలం చామనపల్లి గ్రామంతో పాటు మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నష్టపరిహారం, పునరావాస సదుపాయాల విషయంలో బాధితులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముంపు గ్రామాలను సందర్శించి బాధితుల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన నాయకులు రాజకీయ విమర్శలకే పరిమితం కావడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలపై వాస్తవాలతో మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని కడారి తిరుపతి సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు మోకెనపెల్లి గోపాల్, రజిత, సురేష్, మ్యాకల అంజమ్మ, మల్లయ్య, ఉప సర్పంచ్ పెంట తిరుపతి, మాజీ సర్పంచ్ రవి నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తడగొండ రాజు, పవన్ రెడ్డి, తరిగొండ తిరుపతి, ఎల్లయ్య, సుంకె దుర్గా ప్రసాద్, అశోక్, రాజు, రాములు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: