తెలంగాణ

బొమ్మన కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న గొల్లపల్లి లయన్స్ క్లబ్

ఐదు నెలల్లో 400 మందికి పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు.. జిల్లా గవర్నర్ ప్రశంసలు తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): మానవ సేవే మాధవ సేవ అనే ఆశయంతో ప్రతి ఒక్కరూ సేవా కార్య…

By · · Updated

Share this article

ఐదు నెలల్లో 400 మందికి పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు.. జిల్లా గవర్నర్ ప్రశంసలు

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

మానవ సేవే మాధవ సేవ అనే ఆశయంతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G గవర్నర్ లయన్ మోర భద్రేశం పిలుపునిచ్చారు.

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎన్వీఆర్ ఏసీ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపల్లి అధికారిక పర్యటన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గవర్నర్ మోర భద్రేశంను క్లబ్ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించి ప్రశంసా తీర్మాన పత్రాన్ని అందజేశారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు లయన్ బొమ్మన కుమార్‌తో పాటు కార్యవర్గ సభ్యులను గవర్నర్ సత్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2024లో ప్రారంభమైన గొల్లపల్లి లయన్స్ క్లబ్ తక్కువ సమయంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బొమ్మన కుమార్ నాయకత్వంలో పేదలకు కంటి చికిత్సలు అందించడం, కొత్త క్లబ్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.

క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్ మాట్లాడుతూ.. గత ఐదు నెలల్లో 10కి పైగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 400 మందికి పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేయించామని తెలిపారు. పాఠశాలల్లో 19 అవగాహన సదస్సులతో పాటు ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ వల్లాల కృష్ణహరి, క్యాబినెట్ ట్రెజరర్ లయన్ కొల్లూరి ఆనందం, లయన్ దేవులపల్లి రాజయ్య, లయన్ జక్కు భూమేష్, లయన్ తాటిపాముల వినోద్, చార్టర్ ప్రెసిడెంట్ ముసుకు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి సాయిని నరహరి, మహంకాళి చంద్రశేఖర్, సట్ట సురేష్, క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: