జాతీయం

​ఢిల్లీలో ఘనంగా 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు - తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు

​పాఠశాల విద్య మరియు అక్షరాస్యతా విభాగం (DoSEL), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డా. బి.ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జర…

By · · Updated

Share this article
​ఢిల్లీలో ఘనంగా 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు - తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు

​పాఠశాల విద్య మరియు అక్షరాస్యతా విభాగం (DoSEL), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డా. బి.ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. "ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత" (Literacy for people, the planet and prosperity) అనే థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలకు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డా.) మాణిక్ సాహా అధ్యక్షత వహించగా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి, విద్యా శాఖ కార్యదర్శి శ్రీ టి.కె. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రాల మంత్రులు ప్రసంగించడంతో పాటు, 'ULLAS - నవ భారత్ సాక్షరతా కార్యక్రమం' ప్రత్యేక చిత్రం మరియు DTH ఛానల్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు, వాలంటీర్లు పాల్గొన్న ఈ వేడుకల్లో భాగంగా, సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ULLAS మేళాలో తెలంగాణ రాష్ట్ర స్టాల్ ద్వారా తమ విజయగాథను ప్రదర్శించనున్నారు.

​తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు

100% అక్షరాస్యత సాధనలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి మంచిర్యాల జిల్లా, కాశిపేట్ మండలం ఎంపికైంది. ఈ మండలం నుండి లెర్నర్లు జ్యోతి, భూమమ్మ, హరిలాల్, వాలంటీర్లు రాజేశ్వరి, కవిత, రజిత, డి.ఆర్.పి. (DRP) శ్రీమతి బండ శాంభవి ఢిల్లీ వేడుకల్లో పాల్గొని సత్కారం పొందారు. డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పురుషోత్తం నాయక్, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి అనిత, రాష్ట్ర వయోజన విద్యా సంచాలకులు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మొహమ్మద్ నుమాన్, స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీమతి శైలజ గార్ల ప్రత్యేక కృషితో ఈ మండలాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించిన ప్రాంతంగా తీర్చిదిద్దినందుకు గాను జాతీయ స్థాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించింది

Tags: