జాతీయం

*దిశా సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చ* 

హసన్పర్తి, తెలంగాణ గళం, అక్టోబర్ 1: *రోడ్డు భద్రత, విద్యా వ్యవస్థ, చిన్నారుల రక్షణపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అధికారులకు ఆదేశం...* హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావ…

By · · Updated

Share this article
*దిశా సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చ* 

హసన్పర్తి, తెలంగాణ గళం, అక్టోబర్ 1:

*రోడ్డు భద్రత, విద్యా వ్యవస్థ, చిన్నారుల రక్షణపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అధికారులకు ఆదేశం...*

హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం హనుమకొండ జిల్లా సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు గారు*, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ముందుగా గత మార్చి 7న నిర్వహించిన దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యల నివేదికలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలు, పూర్తయిన పనులు, అమలు దశలో ఉన్న కార్యక్రమాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్య–ఆరోగ్యం, రోడ్లు, రోడ్డు భద్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన నిరుపేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

*రోడ్డు భద్రతపై అధికారులతో చర్చ*

సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు రోడ్డు భద్రత అంశంపై ప్రత్యేకంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి నిర్వహణపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

*విద్యా వ్యవస్థపై సమీక్ష*

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల అందుబాటు తదితర అంశాలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

*చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి*

ముస్కాన్ ఆపరేషన్ ద్వారా చిన్నారుల రక్షణ, బాల కార్మికుల నిర్మూలన, తప్పిపోయిన లేదా రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారికి భద్రత కల్పించే అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. చిన్నారుల భద్రత విషయంలో పోలీస్, మహిళా–శిశు సంక్షేమ, విద్యాశాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చూడాలని సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు.

జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అధికారులు సమగ్ర వివరాలను దిశా కమిటీకి అందించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

న్యూస్ ప్రతినిధి: మోడెం సందీప్,