తెలంగాణ

దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖ

​మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, దాండియా కార్యక్రమంలో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఉత…

By · · Updated

Share this article
దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖ

​మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, దాండియా కార్యక్రమంలో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మార్వాడి సోదరీమణులతో కలిసి సందడిగా దాండియా ఆడారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య - మహేష్, కార్పొరేటర్లు మాదంశెట్టి సత్యనారాయణ, చిలువేరి జ్యోతి - శ్రీనివాస్, పెంట రజిత - రమేష్, మార్వాడి సంఘం సభ్యులు జుగల్ కిషోర్ వ్యాస్, గోపాల్ వ్యాస్, భరత్ లడ్డా తదితరులు పాల్గొన్నారు

Tags: