తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పరకాల పోలీసుల ఉక్కుపాదం.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు!

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పరకాల పోలీసుల ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు! మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు..  పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 23: రోడ్డు ప్రమాదాల నివారణే…

By · · Updated

Share this article
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పరకాల పోలీసుల ఉక్కుపాదం.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు!

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పరకాల పోలీసుల ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు!

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.. 

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 23:

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పరకాల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాహనదారులను తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో పరకాల ఎస్సై పవన్‌తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. 

మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులకు సహకరించి, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Tags: