పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 18:
పరకాల:* పట్టణంలోని దామెర చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్, 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ దంపతులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి, అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.






