తెలంగాణ

దళితబంధు రెండో విడత లబ్ధిదారులకు రూ.2 లక్షలు విడుదల చేయాలి!

పెండింగ్ నిధుల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం.. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఏకు కార్తీక్ డిమాండ్ పరకాల తెలంగాణ గళం:అక్టోబర్ 27 దళితబంధు పథకం రెండో విడత లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే రూ.2 లక…

By · · Updated

Share this article
దళితబంధు రెండో విడత లబ్ధిదారులకు రూ.2 లక్షలు విడుదల చేయాలి!

పెండింగ్ నిధుల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం..

దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఏకు కార్తీక్ డిమాండ్

పరకాల తెలంగాణ గళం:అక్టోబర్ 27

దళితబంధు పథకం రెండో విడత లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే రూ.2 లక్షల నిధులు విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఏకు కార్తీక్ డిమాండ్ చేశారు. 

దళితబంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏకు కార్తీక్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో విడత లబ్ధిదారులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షల నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

దళిత కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, స్వావలంబన లక్ష్యంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం నిధులు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా నిధులు విడుదల చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

రెండో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే వరకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా దళితబంధు సాధన సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఏకు కార్తీక్ స్పష్టం చేశారు.

Tags: