తెలంగాణ

చింతగట్టులో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

హసన్‌పర్తి : తెలంగాణ గళం సెప్టెంబర్ 10. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గ్రామస్తులు అత్య…

By · · Updated

Share this article
చింతగట్టులో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

హసన్‌పర్తి : తెలంగాణ గళం సెప్టెంబర్ 10.

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గ్రామస్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ... నాటి నైజాం రజాకార్ల అరాచకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం, తన భూమి హక్కు కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.