తెలంగాణ గళం, సెప్టెంబర్ 5
హనుమకొండ జిల్లా..ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాబోయే దేశ పౌరులు అని అల్పాహారం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి అని,కార్పొరేట్ తరహా మౌలిక వసతులు, అల్పాహారం,మధ్యాహ్న భోజనం,నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని అన్నారు.






