తెలంగాణ

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి: నరెడ్ల శ్రీనివాస్

వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా కమిటీ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల ఐ.బి. మున్సిపల్ ఆఫీస్ రోడ్డు చౌరస్తా వద్ద సంయుక్తంగా కార్…

By · · Updated

Share this article

వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా కమిటీ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల ఐ.బి. మున్సిపల్ ఆఫీస్ రోడ్డు చౌరస్తా వద్ద సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని, ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కాలంలో ఎదురైన పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువను నేటి బీసీ సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలని, బీసీల హక్కుల సాధన కోసం అన్ని కుల సంఘాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు సమాన అవకాశాల కోసం బీసీ సమాజం సమిష్టిగా ఉద్యమించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా కార్యదర్శి బియ్యాల సత్తయ్య, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట పద్మాదేవి, పట్టణ అధ్యక్షురాలు ఇనవంక నాగలక్ష్మి, నాయకులు ఎం.డి. హుస్సేన్, ఎం.డి. లతీఫ్, తాటిపాముల సమ్మయ్య, ఎనగందుల వెంకటేష్, పల్లపు శ్రీనివాస్, ముదిపల్లి రమేష్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు సంగెపు ఎల్లయ్య, పసుపునూటి కుమార్, కంచర్ల కొమురయ్య, ఒరుగంటి ఎల్లయ్య, గంగిపెళ్లి ఎల్లయ్య, తాడూరి శంకర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

Tags: