పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 10:
చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరకాల పట్టణంలోని అమరధామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ పోరాటం ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అన్యాయాన్ని ఎదిరిస్తూ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, కిసాన్ మోర్చా రాష్ట్ర లీగల్ సెల్ నాయకురాలు వేముల సదా రాణి ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి కృష్ణ ప్రసాద్, బాసాని సోమరాజు, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






