తెలంగాణ

రాత్రి వేళల్లో వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్న నిందితుడి అరెస్ట్

కేసు వివరాలు వెల్లడించిన కేయూ సీఐ రవికుమార్​ తెలంగాణ గళం /హనుమకొండ/కాకతీయ యూనివర్సిటీ: (సెప్టెంబర్ 20): రాత్రి వేళల్లో రోడ్లపై నిలిపి ఉంచే లారీలు, ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీల దొంగతనాల…

By · · Updated

Share this article
రాత్రి వేళల్లో వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్న నిందితుడి అరెస్ట్

కేసు వివరాలు వెల్లడించిన కేయూ సీఐ రవికుమార్​

తెలంగాణ గళం /హనుమకొండ/కాకతీయ యూనివర్సిటీ:

(సెప్టెంబర్ 20):

రాత్రి వేళల్లో రోడ్లపై నిలిపి ఉంచే లారీలు, ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జిల్లా దొంగను కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 1,00,000 విలువ చేసే 16 వాహనాల బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు కేయూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.​

కేసు వివరాలు:

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏనుమాముల బాలాజీ నగర్‌కు చెందిన పస్తం అయిలు కుమార్ (35) ప్రస్తుతం హనుమకొండ బాలసముద్రంలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆటో ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, అతని వ్యసనాలకు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మొదటిసారిగా 2012లో వరంగల్ బస్టాండ్‌లో సెల్ ఫోన్లు దొంగిలించగా, ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏకంగా 36 దొంగతనం కేసులు ఉన్నాయి.​

చోరీల తీరు:

గత కొంతకాలంగా నిందితుడు పగటిపూట ఆటో నడుపుతూ రాత్రి వేళల్లో జవహర్ కాలనీ, వడ్డేపల్లి, మిల్స్ కాలనీ, మడికొండ ప్రాంతాల్లో తిరిగేవాడు. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్టర్లు, లారీల బ్యాటరీలను దొంగిలించేవాడు. ఇటీవల కాకతీయ యూనివర్సిటీ, మడికొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 5 చోరీ కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కేయూ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల నిజం బయటపడింది.​నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వాహన దారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

రిపోర్టర్ మోడెమ్ సందీప్, హనుమకొండ