తెలంగాణ గళం/హాసన్ పర్తి, (సెప్టెంబర్ 20):
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 55వ డివిజన్ భీమారంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వర్ధన్నపేటశాసనసభ్యులు,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్, ఎర్రగట్టుగుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ మార్క రాజు, జిల్లా నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరీ గడ్డం వరుణ్, ముఖ్య నాయకులు సుమంత్, మురళీకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మోడెమ్ సందీప్





