తెలంగాణ

*భీమారం మండలంలో అక్రమ వెంచర్లపై ఆరా

మంచిర్యాల జిల్లా భీమారం మండల పరిధిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు ఆరా తీయాలని మండల పౌరుడు మంతెన నమ్మయ్య డిమాండ్ చేశారు. భీమారం మండల పరిధిలోని గ్రామాల్లో డీటీసీపీ…

By · · Updated

Share this article
*భీమారం మండలంలో అక్రమ వెంచర్లపై ఆరా

మంచిర్యాల జిల్లా భీమారం మండల పరిధిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు ఆరా తీయాలని మండల పౌరుడు మంతెన నమ్మయ్య డిమాండ్ చేశారు.

భీమారం మండల పరిధిలోని గ్రామాల్లో డీటీసీపీ లే-అవుట్స్ అంటూ కొందరు ప్రజలను బహిరంగంగానే మోసం చేస్తున్నారని, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆదివారం ప్రజాపాలన కార్యక్రమంలో నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.

మండల వ్యాప్తంగా ఎన్ని వెంచర్లు ఉన్నాయి? వాటికి డీటీసీపీ అనుమతి ఉందా? లేదా? అనుమతి ఉంటే ఆయా వెంచర్ల అనుమతి సంఖ్య, పంచాయతీ ధృవీకరణ తేదీ, రహదారులు, పార్కులు, మౌలిక వసతులు ఉన్నాయా? లేవా? అనే పూర్తి వివరాలను అధికారికంగా సేకరించి ఇవ్వాలని కోరారు

అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు జరుపుతున్న వెంచర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని వినతిలో పేర్కొన్నారు

ప్రజల ప్రయోజనార్థం ఈ సమాచారాన్ని ప్రజావాణి ద్వారా అందించాలని ఆయన కోరారు

Tags: