హనుమకొండ / చింతగట్టు (న్యూస్):
హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గాంధీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకకళ్యాణం, గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ నిర్వాహకులు శ్రద్ధాభక్తులతో గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు. అనంతరం మండపం వద్దకు విచ్చేసిన భక్తులకు,యూత్ అసోసియేషన్ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమం (మహాప్రసాద వితరణ) చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను కాలనీ వాసుల సహకారంతో భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు,మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





