హసన్పర్తి, సెప్టెంబర్ 7 (తెలంగాణ గళం):
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ హసన్పర్తి మండల భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు సోమవారం విస్తృత నిరసనలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బారాస ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గామని పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేల బృందాన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు హసన్పర్తి మండల బారాస నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ (GWMC) 66వ డివిజన్ బారాస అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజినీకర్, 1వ డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ మరియు సోషల్ మీడియా సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





