బతుకునిచ్చినావే బడుగు జీవుల బతుకమ్మ
తొమ్మిది రోజులు నిన్ను పూలతో కొలుస్తామమ్మా
ప్రకృతిని పరమాత్మగా పూజించే పల్లె ప్రజల ప్రసాదానివమ్మా
కుల మత కలతలు లేని ఆడపడుచుల ఆత్మ గౌరానివమ్మా
బతుకమ్మ పూజలో మీరే పురోహితులమ్మా
పూల పరిమళం పుడమి సిగలోని వెలుగులు మీరమ్మా
తన్మయంగా పరిచిన తంగేడు సుమములమ్మా
పూల గుత్తులతో తరలివచ్చిన తరుణాలోయమ్మా
అనురాగ ఆడపడుచుల గుండెల నిండా ఆనందమమ్మా
బంతిపూల సొగసు బతుకమ్మకు అందలమమ్మా
చామంతుల వన్నెల చల్లని పరవశవమ్మా
నీలి మబ్బు తెలరలోన వెల్లివిరిసిన సింగిడివమ్మా
మట్టి పరిమళంలో మమతలు నిండిన సంబరాలమ్మా
పచ్చని పొలాల ఒడిలో సుస్వరాల పాటలమ్మా
నేలమ్మ ఎదపై పరువపు విరుల సొగసులమ్మా
చిందులతో ఆడి పాడి కనువిందు చేసే అతివలోయమ్మా
సర్వలోకాలకు సద్గతిని కలిగించే స్వరూప రూపిణివమ్మా
ప్రకృతిని ప్రకాశింపచేసే ప్రసూనముల పరువమమ్మా
కోలాహలములతో కొలాటమాడే కొండంత దైవానివమ్మా
సద్దుల బతుకమ్మ సంబరాలు తీర్చగ మళ్లీ రావమ్మా
మా బంగారు తల్లి బతుకమ్మా......
నీకు వందనమోయమ్మా
*జక్కు కృష్ణమూర్తి గౌడ్*
తెలుగు భాషోపాధ్యాయుడు,
9912328949






