లక్షెట్టిపేట: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని SPR గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన మొత్తం 312 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90,00,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రాజేష్, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మాజీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, మాజీ పట్టణ అధ్యక్షులు ఆరీఫ్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ శ్రేణులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






