తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తమ న్యాయమైన అధికార హక్కులు మరియు డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్కు బయలుదేరిన మంచిర్యాల జిల్లా భీమారం మండల ఉప సర్పంచుల ఫోరం నాయకులను స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
భీమారం మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆకుల రవీందర్, ఉపాధ్యక్షులు దుర్గం జనార్దన్, సలహాదారులు మరియు గౌరవ అధ్యక్షులు కామర నరేందర్తో పాటు మండలంలోని పలువురు ఉప సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేయడానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం సరికాదని, పోలీసుల ముందస్తు అరెస్టులను ఉప సర్పంచుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు






