తెలంగాణ

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పోటీ.సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం!

పరకాల నియోజకవర్గంలో 13 పోస్టులకు 450 మంది దరఖాస్తు.. పరకాల పట్టణంలో ఒక్క పోస్టుకు 120 మంది పోటీ పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 23: పాత మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగ…

By · · Updated

Share this article
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పోటీ.సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం!

పరకాల నియోజకవర్గంలో 13 పోస్టులకు 450 మంది దరఖాస్తు.. పరకాల పట్టణంలో ఒక్క పోస్టుకు 120 మంది పోటీ

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 23:

పాత మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ పోస్టులను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకోవడంతో ఈ నియామక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

పరకాల నియోజకవర్గ పరిధిలో మొత్తం 13 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఉండగా, వీటి కోసం 450 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పరకాల పట్టణానికి సంబంధించి ఒక్క పోస్టు మాత్రమే ఉండగా, ఆ పోస్టు కోసం 120 మంది మహిళలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో ఒక్క పోస్టుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 

నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అభ్యర్థులు కోరారు.

Tags: