*అనారోగ్యంతో మృతి చెందిన దాసరి సంజీవ కుటుంబానికి నల్లమోతు సిద్ధార్థ పరామర్శ*
మిర్యాలగూడ టౌన్ సెప్టెంబర్ 20 ( తెలంగాణ గళం ప్రతినిధి - అంబటి కృష్ణ )
మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు దాసరి నాగరాజు గారి సోదరుడు దాసరి సంజీవ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందారు.
విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు ఈరోజు గుర్రప్పగూడెంలోని వారి స్వగృహానికి వెళ్లి దాసరి సంజీవ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ర ఇంద్రారెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ సందేశి అంజన్ రాజు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*అనారోగ్యంతో మృతి చెందిన దాసరి కుటుంబానికి నల్లమోతు సిద్ధార్థ పరామర్శ*
*అనారోగ్యంతో మృతి చెందిన దాసరి సంజీవ కుటుంబానికి నల్లమోతు సిద్ధార్థ పరామర్శ*మిర్యాలగూడ టౌన్ సెప్టెంబర్ 20 ( తెలంగాణ గళం ప్రతినిధి - అంబటి కృష్ణ )మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన బిఆ…
By తెలంగాణ గళం · · Updated
Share this article




