తాజా వార్తలు

అమ్మవారి శోభాయాత్ర

"అమ్మవారి శోభాయాత్ర"తెలంగాణ గళం  అక్టోబర్ 17 (కడం): దిల్దార్ నగర్ గ్రామంలో  శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి పురవీధుల శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల…

By · · Updated

Share this article

"అమ్మవారి శోభాయాత్ర"
తెలంగాణ గళం  అక్టోబర్ 17 (కడం):
 దిల్దార్ నగర్ గ్రామంలో  శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి పురవీధుల శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రముఖులు  ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శోభాయాత్ర దిల్దార్ నగర్ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు వీధులన్నింటినీ రంగవల్లులు, తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, భజనల నడుమ దుర్గమ్మ ఉత్సవ విగ్రహ ఊరేగింపు నయనానందకరంగా సాగింది. ప్రతి ఇంటి వద్ద మహిళలు అమ్మవారికి ఘనంగా స్వాగతం పలుకుతూ మంగళహారతులు ఇచ్చారు. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు.
ఈ శోభాయాత్రలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ నిర్వాహకులు, యువకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ  కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులందరి సహకారంతో దుర్గమ్మ శోభాయాత్ర అత్యంత భక్తిభావంతో ప్రశాంతంగా ముగిసిందని ఆలయకమిటీ తెలిపారు.

Tags: