తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

తెలంగాణ గళం, సెప్టెంబర్ 6 11 క్వింటాళ్ల 55 కిలోల బియ్యం స్వాధీన హనుమకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహన త…

By · · Updated

Share this article
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

తెలంగాణ గళం, సెప్టెంబర్ 6

11 క్వింటాళ్ల 55 కిలోల బియ్యం స్వాధీన

హనుమకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న TS 07 UE 1796 వాహనాన్ని తనిఖీ చెయ్యగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 బస్తాల పీడీఎస్ బియ్యం గుర్తించారు.

మొత్తం 11 క్వింటాళ్ల 55 కిలోల బియ్యం, విలువ సుమారు రూ.30,030గా పోలీసులు తెలిపారు.బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమంగా తరలిస్తున్నార నే ఆరోపణలపై పల్లెపు కల్పన, ఎత్తరు శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిపై దామెర ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: