తెలంగాణ

5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులు ప్రారంభం!

నాలుగు మహారాజ గోపురాలు, ప్రాకార మండపం, మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల తెలంగాణ గళం: అక్టోబర్ 26 పరకాల పట్టణంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స…

By · · Updated

Share this article
5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులు ప్రారంభం!

నాలుగు మహారాజ గోపురాలు, ప్రాకార మండపం, మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల తెలంగాణ గళం: అక్టోబర్ 26

పరకాల పట్టణంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా శైవాగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగు మహారాజ గోపురాలు, ప్రాకార మండపం, మాడవీధుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.

పరకాల పట్టణానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి చేపట్టిన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి మరింత శోభ చేకూరడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Tags: