తెలంగాణ

పరకాల 12వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 11: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య, శ్రీధర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు…

By · · Updated

Share this article
పరకాల 12వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 11:

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య, శ్రీధర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, 12వ వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రేణుకతో పాటు స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags: