అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి గంట కళావతి
పరకాల,తెలంగాణ గళం, అక్టోబర్ 08:
వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరకాల 12వ వార్డులో ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంటెస్టెడ్ కౌన్సిలర్ గంట కళావతి కోరారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి హమీద్, వార్డు అధ్యక్షుడు అవినాష్‌గౌడ్, ఉమతో పాటు స్థానిక నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.






