తెలంగాణ

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి - రూ.60 వేలకుపైగా నష్టం పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 29: కంటాత్మకూరు, నడికూడ:మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి…

By · · Updated

Share this article
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి - రూ.60 వేలకుపైగా నష్టం

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 29:

కంటాత్మకూరు, నడికూడ:మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన గాదం రాజయ్య ఇంటి దొడ్డిలో కట్టివేసిన గొర్రె పిల్లలపై మూకుమ్మడిగా దాడి చేశాయి.

ఈ ఘటనలో 12 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఒక్కో గొర్రె పిల్ల విలువ సుమారు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.60 వేలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.

వీధి కుక్కల దాడితో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గాదం రాజయ్య వేడుకున్నారు.

Tags: