తెలంగాణ

వాతావరణ మార్పుల నుంచి రైతులను ఆదుకోవాలి ఆర్డీవోకు వినతి

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 28: పరకాల: వాతావరణ మార్పుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరింది. ఈ మేరకు సమితి ప్రత…

By · · Updated

Share this article
వాతావరణ మార్పుల నుంచి రైతులను ఆదుకోవాలి ఆర్డీవోకు వినతి

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 28:

పరకాల: వాతావరణ మార్పుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరింది.

ఈ మేరకు సమితి ప్రతినిధులు పరకాల ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. చెట్ల నరికివేత, నీటి వనరుల పరిరక్షణలో లోపాలు, కాలుష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

చెట్ల నరికివేతను అరికట్టి మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించాలని కోరారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, వాతావరణ ఆధారిత వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు వరికెల కిషన్ రావు, చౌల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: