తెలంగాణ

వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి మున్సిపల్ అధికారులకు బీజేపీ నేత వినతి

వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి - మున్సిపల్ అధికారులకు బీజేపీ నేత వినతి పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 29: పరకాల: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ట్యాంకులను వెంటనే ప…

By · · Updated

Share this article
వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి మున్సిపల్ అధికారులకు బీజేపీ నేత వినతి

వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి - మున్సిపల్ అధికారులకు బీజేపీ నేత వినతి

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 29:

పరకాల: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ట్యాంకులను వెంటనే పరిశీలించి శుభ్రపరచాలని బీజేపీ పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి కోరారు.

ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, చైర్మన్ కు వాటర్ ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచి, అవసరమైన చోట్ల శానిటైజేషన్ చేయాలని కోరారు. ప్రజలకు అందించే తాగునీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజారోగ్యమే ప్రథమ కర్తవ్యం, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి పౌరుడి హక్కు అని ఆయన పేర్కొన్నారు.

Tags: