హనుమకొండ /వరంగల్ (తెలంగాణ గళం):
తెలంగాణ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి (DM&HO) కార్యాలయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 38 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
పిడియాట్రీషియన్ (1), OBG స్పెషలిస్ట్ (1), MLHP/CHO/MO (15), జిల్లా ఎపిడెమియాలజిస్ట్ (1), ల్యాబ్ మేనేజర్ (1), స్టాఫ్ నర్స్ (7), ANM/2వ ANM (4), ల్యాబ్ టెక్నీషియన్ (4), ఫార్మాసిస్ట్ (1), పబ్లిక్ హెల్త్ మేనేజర్ (2) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతను బట్టి నెలకు ₹19,500 నుండి ₹1,000,000 వరకు వేతనం చెల్లిస్తారు.
వయోపరిమితి & రుసుము:
18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు (అభ్యర్థుల రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది). దరఖాస్తు రుసుము ₹500 ని 'DM&HO, Warangal' పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తు ప్రారంభం: 03 అక్టోబర్ 2026
* చివరి తేదీ: 09 అక్టోబర్ 2026
* తాత్కాలిక మెరిట్ జాబితా: 27 అక్టోబర్ 2026
* తుది ఎంపిక జాబితా: 31 అక్టోబర్ 2026
* కౌన్సెలింగ్: 05 నవంబర్ 2026
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ మరియు కుల ధృవీకరణ పత్రాల జిరాక్స్ (స్వీయ ధృవీకరణ/Self-attest చేసినవి), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు ₹500 DD జతచేసి వరంగల్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో స్వయంగా గానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ అక్టోబర్ 09 లోపు సమర్పించాలి.
మరిన్ని వివరాలకు https://warangal.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
రిపోర్టర్ : మోడెం సందీప్






