తెలంగాణ

ఆదర్శనగర్ కాలనీలో వైభవంగా దీపారాధన

పరకాల తెలంగాణ గళం, సెప్టెంబర్ 19 పరకాల ఆదర్శనగర్ కాలనీలో వైభవంగా దీపారాధన   పరకాల: పరకాల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవార…

By · · Updated

Share this article
ఆదర్శనగర్ కాలనీలో వైభవంగా దీపారాధన

పరకాల తెలంగాణ గళం, సెప్టెంబర్ 19

పరకాల ఆదర్శనగర్ కాలనీలో వైభవంగా దీపారాధన

 

పరకాల: పరకాల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గణపతికి ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. భక్తుల గణపతి నామస్మరణతో కాలనీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

కాలనీవాసుల ఐక్యత, భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags: