తెలంగాణ

ఉద్యమకారుడు మార్క భాస్కర్ గౌడ్‌కు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) వర్ధన్నపేట కో-కన్వీనర్‌గా పదవి

హసన్‌పర్తి, తెలంగాణ గళం ,(సెప్టెంబర్ 17). తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి నుండి రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమ జెండాను ఊపిరిగా చేసుకుని పోరాడిన చురుకైన కార్యకర్త, చింతగట్టు గ్రామ నివాసి మార్క భాస్కర్ గౌడ్‌…

By · · Updated

Share this article
ఉద్యమకారుడు మార్క భాస్కర్ గౌడ్‌కు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) వర్ధన్నపేట కో-కన్వీనర్‌గా పదవి

హసన్‌పర్తి, తెలంగాణ గళం ,(సెప్టెంబర్ 17).

తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి నుండి రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమ జెండాను ఊపిరిగా చేసుకుని పోరాడిన చురుకైన కార్యకర్త, చింతగట్టు గ్రామ నివాసి మార్క భాస్కర్ గౌడ్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) వర్ధన్నపేట నియోజకవర్గ కో-కన్వీనర్‌గా నియమించారు.

ఈ మేరకు TUF రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.భాస్కర్ గౌడ్ నియామకం పట్ల TUF హనుమకొండ జిల్లా అధ్యక్షులు మోదినిపురోజు రాముచారి మరియు చింతగట్టు గ్రామ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో హసనపర్తి మండలానికి గుండెకాయలా పనిచేసిన చింతగట్టు గ్రామానికి చెందిన ఉద్యమకారుడిని గుర్తించి ఈ పదవి అప్పగించడం అభినందనీయమన్నారు.

ఉద్యమకారుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం చేస్తున్నందుకు గాను TUF రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర ప్రధాన ప్రచార కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీకి చింతగట్టు గ్రామ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.