హనుమకొండ, తెలంగాణ గళం, సెప్టెంబర్ 12:
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, నిఖార్సైన ఉద్యమకారిణిగా గుర్తింపు పొందిన జనగాని రాజ్యలక్ష్మి గారిని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) హనుమకొండ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
ఈ మేరకు TUF రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి బహిరంగ సభకు హాజరవుతూ. రిలే నిరాహార దీక్షలు, రైలు రోకోలు, వంటా-వార్పు వంటి కార్యక్రమాల్లో రాజ్యలక్ష్మి గ్రామస్థాయి నుంచి ముందుండి నడిచారు. ఉద్యమకారుల హక్కుల సాధన, వారి రాజకీయ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ పదవిని కేటాయించినట్లు కమిటీ తెలిపింది.
తమ హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తానని, ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన TUF రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చిలువేరు రమేష్లకు చింతగట్టు ఉద్యమకారుల తరపున, మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు మోదినిపురోజు రాముచారి గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె నియామకం పట్ల స్థానిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.






