తెలంగాణ

ప్రజా పాలనతోనే తెలంగాణ అభివృద్ధి.అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి    పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు…

By · · Updated

Share this article
ప్రజా పాలనతోనే తెలంగాణ అభివృద్ధి.అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

 

 పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 17:

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గురువారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామంలో నిర్వహించిన వేడుకలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

 

ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, త్యాగాలను ఎప్పటికీ మరువరాదని అన్నారు.

 

పరకాల అమరధామం మరో జలియన్‌వాలాబాగ్‌ను తలపించే చారిత్రక ప్రదేశమని, ఇక్కడ జరిగిన అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని అన్నారు.

Tags: