తెలంగాణ

స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

పరకాల, తెలంగాణ గళం , సెప్టెంబర్ 18: పరకాల పట్టణంలో స్నేహ యూత్ వ్యవస్థాపకులు పున్నం లక్ష్మి, రవి, భాను ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గవర…

By · · Updated

Share this article
స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

పరకాల, తెలంగాణ గళం , సెప్టెంబర్ 18:

పరకాల పట్టణంలో స్నేహ యూత్ వ్యవస్థాపకులు పున్నం లక్ష్మి, రవి, భాను ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా నిరుపేదలకు, వృద్ధులకు, ఆటో డ్రైవర్లకు, భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. మానవ సేవే మాధవ సేవ అని, ఆకలితో అలమటించే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

 

ఈ కార్యక్రమంలో  స్నేహ యూత్ సభ్యులు, భక్తులు స్థానికులు పాల్గొన్నారు.

Tags: