తెలంగాణ

SIR ఫేజ్ 2లో పరకాలకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, క్షేత్రస్థాయి సమన్వయానికి రాష్ట్రస్థాయి గుర్తింపు పరకాల ,తెలంగాణ గళం, అక్టోబర్ 05,  ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఫేజ్–2 ప్రక్రియలో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థ…

By · · Updated

Share this article
SIR ఫేజ్ 2లో పరకాలకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, క్షేత్రస్థాయి సమన్వయానికి రాష్ట్రస్థాయి గుర్తింపు

పరకాల ,తెలంగాణ గళం, అక్టోబర్ 05, 

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఫేజ్–2 ప్రక్రియలో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని పరకాల నియోజకవర్గ SIR ప్రక్రియ మానిటర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి తెలిపారు.

పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ ముందుకు సాగినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి దశ SIRలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిన పరకాల నియోజకవర్గం, రెండో దశలో మరింత సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగిన SIR ప్రక్రియలో పరకాల నియోజకవర్గానికి ఈ స్థానం దక్కడం ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, క్షేత్రస్థాయి సమన్వయం, నిరంతర పర్యవేక్షణకు ఫలితమని చందుపట్ల రాజిరెడ్డి పేర్కొన్నారు.

SIR ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రతి మండల పార్టీ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ దశలవారీగా సమీక్షలు నిర్వహించారని తెలిపారు. 

నియోజకవర్గ SIR ఇన్‌చార్జ్‌లు, మాజీ, ప్రస్తుత మండల అధ్యక్షులు, పట్టణ, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ప్రక్రియ పురోగతిని సమీక్షించినట్లు వివరించారు.

క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా మార్గనిర్దేశం చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగించారని తెలిపారు. 

బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు బాధ్యతలను స్పష్టంగా విభజించి, వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం ద్వారా SIR ఫేజ్–2లో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందన్నారు.

ఈ సందర్భంగా SIR ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ సిబ్బందికి చందుపట్ల రాజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తాజా, మాజీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags: