రక్తదానం.. ప్రాణదానం అంటూ సేవా బాటలో బీజేవైఎం
పరకాలలో ఘనంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం
పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ :27
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా పరకాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కార్యాలయం ఎదుట రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు, డా. సిరంగి సంతోష్ కుమార్, డా. పేసరు విజయ్ చంద్ర రెడ్డి తదితరులు హాజరై రక్తదాతలను అభినందించారు.
ఈ సందర్భంగా డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని అన్నారు. ఒక యూనిట్ రక్తదానం ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
సేవా భావంతో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
‘రక్తదానం–ప్రాణదానం’ అనే సందేశంతో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం అందించే సేవా సంకల్పాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంత్ లాల్, దేవునూరి మేఘనాథ్, ఎర్ర రామన్న, గురిజాల శ్రీరామ్ రెడ్డి, పరకాల రూరల్ అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్, దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్‌కుమార్, రాదారపు రతన్ కుమార్, సంగ పురుషోత్తం, గండు ముకేష్, కొలనుపాక సిద్దు, కక్కు రాజు, మాచబోయిన క్రాంతి, మంద మనోజ్, రాజశేఖర్, గోగుల రాజిరెడ్డి, హరికృష్ణ, కందుల రవి వర్మ, బాణాల శ్రీనివాస్, ఆకుల రాంబాబు, పి. రంతు కుమార్ తదితరులతో పాటు వివిధ మండలాల బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






