భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గరిమిళ్ళ జోన్ అధ్యక్షులు అమీరిశెట్టి రాజు కుమార్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజు కుమార్ మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని, 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉండిపోయిన హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 'ఆపరేషన్ పోolo' ద్వారా విలీనం చేశారని తెలిపారు. రజాకారుల అరాచకాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా దక్కిన ఈ చారిత్రక దినాన్ని కేంద్ర ప్రభుత్వం, పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లే, తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించి ఆ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ బోట్ల సత్యం, జిల్లా మీడియా ఇన్చార్జి పల్లి రాకేష్, గర్మిళ్ల జోన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడికొండ శ్రీనివాస్, కర్రె లచ్చన్న, తూటి సరస్వతి, తరుణ్ సింగ్, రాకేష్ రైన్వా, పచ్చ వెంకటేశ్వర్లు, ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు





