తెలంగాణ

పరకాలలో శరన్నవరాత్రుల ప్రచార రథం ప్రారంభం

పరకాల, తెలంగాణ గళం,అక్టోబర్ 06: పరకాల రాబోయే దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని పరకాల బస్ డిపో సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో జరుగనున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రచార రథాన్ని…

By · · Updated

Share this article
పరకాలలో శరన్నవరాత్రుల ప్రచార రథం ప్రారంభం

పరకాల, తెలంగాణ గళం,అక్టోబర్ 06:

పరకాల రాబోయే దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని పరకాల బస్ డిపో సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో జరుగనున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రచార రథాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రచార రథం ద్వారా పట్టణంలోని ప్రధాన వీధుల్లో శరన్నవరాత్రి ఉత్సవాల గురించి భక్తులకు అవగాహన కల్పించనున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బండి సదానందం గౌడ్, బండి కుమారస్వామి గౌడ్, బండి రవి, దొమ్మటి సదానందం, మోడెం రామన్న, మేరుగు శ్రీశైలం, ఏరుకొండ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: