తెలంగాణ

సప్తగిరి కాలనీ సాయి సేవా ట్రస్ట్‌లో పండ్ల పంపిణీ:

సప్తగిరి కాలనీ సాయి సేవా ట్రస్ట్‌లో పండ్ల పంపిణీ: తెలంగాణ గళం/హనుమకొండ, (సెప్టెంబర్26): హనుమకొండలోని సప్తగిరి కాలనీలో గల సాయి సేవా ట్రస్ట్‌లోని పిల్లలకు చింతగట్టు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ జనగాని…

By · · Updated

Share this article
సప్తగిరి కాలనీ సాయి సేవా ట్రస్ట్‌లో పండ్ల పంపిణీ:

సప్తగిరి కాలనీ సాయి సేవా ట్రస్ట్‌లో పండ్ల పంపిణీ:

తెలంగాణ గళం/హనుమకొండ, (సెప్టెంబర్26):

హనుమకొండలోని సప్తగిరి కాలనీలో గల సాయి సేవా ట్రస్ట్‌లోని పిల్లలకు చింతగట్టు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ జనగాని వెంకటేశం గారి జ్ఞాపకార్థం పండ్లు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మగుడి అంగన్‌వాడీ కేంద్రం టీచర్ మోడెమ్ స్వప్న పాల్గొని చిన్నారులకు ప్లేట్లు, మరియు పండ్లను అందజేశారు.

సిడిపిఓ (CDPO) స్వరూప, సూపర్వైజర్ కల్పనల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.

చింతగట్టుకు చెందిన జనగాని వెంకటేశం గారి జ్ఞాపకార్థం ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు