తెలంగాణ

సన్నబియ్యంతో పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కొయ్యడ శ్రీనివాస్*  పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పరకాల మున్సిపాలిటీ 19వ వ…

By · · Updated

Share this article
సన్నబియ్యంతో పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కొయ్యడ శ్రీనివాస్* 

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08:

పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పరకాల మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.

పరకాల పట్టణంలోని 19వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డులు, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు పేదలకు సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

గత పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్ల నమోదులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు కల్పిస్తూ, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా సన్నబియ్యం అందించడం ద్వారా పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీధర్, సురేష్, షఫీ, రాహుల్‌తో పాటు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Tags: