తెలంగాణ

సన్న వడ్ల బోనస్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 17 వరకు పొడిగింపు

సన్న వడ్ల బోనస్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 17 వరకు పొడిగింపు హసన్‌పర్తి, తెలంగాణ గళం (సెప్టెంబర్ 16): వ్యవసాయ శాఖ కీలక నిర్ణయంఏడు రకాల సన్న ధాన్యాలకే రూ.500 బోనస్ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి  వానాకాలం స…

By · · Updated

Share this article
సన్న వడ్ల బోనస్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 17 వరకు పొడిగింపు

సన్న వడ్ల బోనస్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 17 వరకు పొడిగింపు

హసన్‌పర్తి, తెలంగాణ గళం (సెప్టెంబర్ 16):

వ్యవసాయ శాఖ కీలక నిర్ణయంఏడు రకాల సన్న ధాన్యాలకే రూ.500 బోనస్ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి  వానాకాలం సీజన్‌లో సన్న వడ్ల సాగు చేసిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ పొందేందుకు వీలుగా పంట వివరాల రిజిస్ట్రేషన్ గడువును వ్యవసాయ శాఖ ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల పంట వివరాలను నమోదు చేసుకోలేకపోయిన రైతులకు ఇదొక మంచి అవకాశమని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించినట్లుగా ఎంపిక చేసిన కేవలం ఏడు రకాల సన్న ధాన్యానికి మాత్రమే ఈ రూ.500 బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. బోనస్ పొందాలనుకునే రైతులు తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

విత్తన డీలర్ల వద్ద రైతులు కొనుగోలు చేసిన రసీదు వివరాలు, పొలంలో సాగు చేసిన పంట వివరాలు ఆన్‌లైన్ డేటాతో సరిపోలితేనే బోనస్ చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. దళారుల ప్రమేయం లేకుండా, అక్రమాలకు తావులేకుండా అర్హులైన అసలైన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

 

హసన్పర్తి మండల రిపోర్టర్ :

మోడెమ్ సందీప్