హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పిఎంసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందస్తుగానే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవిందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. పాఠశాల మహిళ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లులు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ పాటలకు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్ మాట్లాడుతూ.... దసరా పండుగకు ముందస్తుగా పాఠశాలలో పీఎంసీ పథకంలో భాగంగా ఎంతో వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో దసరాను అతి పెద్ద పండుగగా భావిస్తుంటారు. దసరా పండుగకు ముందు బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తాయి. ఈ ఏడాది తెలంగాణ ప్రజలు బతుకమ్మ, దసరా పండుగలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాది ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు వైభవంగా సాగుతాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు పూలను పూజిస్తారు. తంగేడు, గునుగు, తామర, బంతి, చామంతి, గులాబీ, కట్లపూలు, రుద్రాక్ష, గన్నేరు వంటి సహజ సిద్ధమైన పూలతో బతుకమ్మను రూపొందించి వేడుకగా ఆడిపాడతారు. ఇలా పూలను పూజించే సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ తొమ్మిది రోజులు పల్లె, పట్టణం తేడా లేకుండా బతుకమ్మ ఆటాపాటలే కనిపిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ సంబురాలు కొనసాగనున్నాయి. మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం సాయంత్రం ‘‘ఎంగిలిపూల బతుకమ్మ’’తో వేడుకలు ప్రారంభం అవుతాయి. బతుకమ్మ వేడుకల్లో... బతుకమ్మను రోజుకో పేరుతో పిలుస్తారు. అలాగే ప్రతిరోజు బతుకమ్మ ఆడటం పూర్తైన తర్వాత నైవేద్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. విద్యార్థులు చదువుతో పాటు, మన సంసృతి సాంప్రదాయాలు తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిపి శ్రీవాణి, టీ డబ్ల్యూ త్రివేణి, ఏఎన్ఓ విజయ్, హెచ్ ఎస్ దీప, మంగా, సరితా బాయ్, రేణుక హేమలత జగదీష్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఎంజెపిలో పిఎంశ్రీ బతుకమ్మ సంబరాలు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పిఎంసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందస్తుగానే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తా…
By తెలంగాణ గళం · · Updated
Share this article



